చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం తాగడం వల్ల లివర్లో పేరుకుపోయిన వ్యర్థాలు కరిగిపోతాయి. విష పదార్థాలు బయటకు వస్తాయి. లివర్ వ్యాధులు ఉన్నవారు నిత్యం నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. నిమ్మరసం తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా మారుతుంది. చర్మానికి తేమ, మృదుత్వం లభిస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.