లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ మూవీ పరాజయం పొందింది. దీంతో ‘ఇండియన్ 3’ థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో రిలీజ్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ దర్శకుడు శంకర్.. ‘ఇండియన్ 3’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ తప్పకుండా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు.