సంగారెడ్డిలోని బాబానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి విద్యాసాగర్ శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల చదువు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM మనోహర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.