SDPT: జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యా యులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు చదువులకు దూరంగా గడుపుతున్నారు. పాఠశాలలో విద్యార్థినులకు రక్షణగా ఉపాధ్యాయులు లేక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.