మెదక్ జిల్లా వైద్యశాలలో దివ్యాంగులకు ఈనెల 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 9 మంది అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వారికి చెప్పడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.