నల్ల శనగలను ఉడకబెట్టి రోజుకూ కప్పు మోతాదులో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే రాత్రి ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో శరీరానికి చేరే క్యాలరీల శాతం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నల్ల శనగలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. షుగర్ ఉన్న వారికి ఇవి చక్కని ఆహారం అని చెప్పవచ్చు.