కొందరు పిల్లలు సరిగా చదవరు. మరికొందరికి చదివింది సరిగా గుర్తుండదు. ఒత్తిడి, మానసిక అలసట దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే తులసి పొడిని స్మూతీస్ లేదా వేడి పాలలో కలిపి పిల్లల చేత తాగిస్తే ఏకాగ్రత పెరుగుతుందని సూచిస్తున్నారు. పెప్పర్ మింట్లు, మింట్ ఆయిల్, పుదీనా ఆకులు చదివింది మరచిపోకుండా ఉపయోగపడతాయట. రోజ్మేరీ ఆయిల్ సువాసన మానసిక అలసటను దూరం చేస్తుంది. అయితే దీన్ని మితంగా వాడాలి.