CTR: పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటి పాలెం సమీపానగల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించి, పూజలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.