BDK: జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్‌లో ఖాళీగా ఉన్న 40 ఉద్యోగాలకు కొత్తగూడెం బాబుక్యాంపు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.