NGKL: అచ్చంపేట పట్టణంలోని హైదరాబాద్- అచ్చంపేట ప్రధాన రహదారి వై జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో బాణాల గ్రామానికి చెందిన నగేశ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.