చలికాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే బొప్పాయి పండు తింటే మంచిది. పపాయను ఈ సీజన్లో తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు. పరిగడుపున దీన్ని తినడవ వల్ల సంపూర్ణ పోషణ అందుతుంది. మలబద్దకం, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గను ధరిచేరనీయదు.