ప్రతి రోజు ఉదయం చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. మరికొందరు పరిగడుపునే తాగేస్తుంటారు. అయితే కొన్ని రకాల టిఫిన్స్ తిన్న తరువాత వీటిని తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. పరాఠాలు తిన్న వెంటనే టీ, కాఫీ తాగవద్దు. ఇలా చేయడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. వైట్ బ్రెడ్, అరటి పండ్లు తిన్న వెంటనే వీటిని సేవిస్తే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.