Jagananna Gorumudda: నేటి నుంచి ‘జగనన్న గోరుముద్ద’లో మరో పోషకాహారం
ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు.
ఏపీ(AP) సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం(Nutritious Food) అందించడమే లక్ష్యంగా జగనన్న గోరు ముద్ద(Jagananna Gorumudda) పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రోజూ మెనూ ప్రకారంగా బలవర్దకమైన, రుచికర పౌష్టికాహారాన్ని జగన్(Jagan) సర్కార్ అందిస్తూ వస్తోంది. తాజాగా ఈ మెనూలో మరో పోషకాహారాన్ని చేర్చినట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.
ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో ఏపీ(AP) సర్కార్ సమూల మార్పులు చేసి జగనన్న గోరుముద్ద(Jagananna Gorumudda) పేరు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వస్తోంది. దీంతో పాటు నేటి నుంచి రాగి జావను కూడా ఏపీ సర్కార్ అందించనుంది. వారంలో మూడు రోజుల పాటు రాగిజావను ఆ తర్వాత మూడు రోజులు చిక్కీని విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఈ జగనన్న గోరు ముద్ద పథకాని(Jagananna Gorumudda) కి ఏపీ సర్కార్ ఏడాదికి రూ.1824 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. రాగి జావ కూడా ఇప్పుడు చేరడంతో మరో రూ.86 కోట్లతో కలిపి జగనన్న గోరుముద్ద పథకానికి మొత్తంగా రూ.1910 కోట్లను ఏపీ(AP) సర్కార్ కేటాయించనుంది.