డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. ఈ నెల 20న ఇది రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక 2:18 నిమిషాల రన్ టైంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక హాస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.