దేశవ్యాప్తంగా 73లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్(RDSS) ద్వారా 2025 మార్చి నాటికి 25 కోట్ల ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. ఇప్పటికే 19.79కోట్ల మీటర్లను మంజూరు చేసినట్లు పేర్కొంది. తమిళనాడుకు 3కోట్లు, త్రిపురకు 5.42లక్షలు, రాజస్థాన్‌కు 1.42కోట్లు, పంజాబ్‌కు 87లక్షలు మంజూరు చేసినట్లు తెలిపింది.