రోజురోజుకు వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధులు(Skin Problems) ఎక్కువగా విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్(Steroids) వినియోగిస్తున్నారు. దీనివల్ల వారు ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal Infection) బారిన పడుతున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులు బాధితులు ప్రారంభంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

చర్మ వ్యాధుల(Skin Diseases) పట్ల నిర్లక్ష్యం వహించినా వ్యాధులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని మందులు ఫంగస్ కు వ్యతిరేకంగా వేగంగా నిరోధకశక్తిని పెంచుతున్నాయని, అదే సందర్భంగా ఆయా మందులను వాడకూడదని వైద్యులు తెలుపుతున్నారు. మందులను సబ్బు, పొడి రూపంలో వాడకూడదని, రోగి పరిస్థితిని బట్టి సరైన మోతాదులోనే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలాంటి సమస్య ఉన్నా కూడా స్టెరాయిడ్స్(Steroids) ఎక్కువగా వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal Infection) అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మనం తినే ఆహారంలో పోషకాలు, ప్రోబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలని, అవి శరీరం ఇన్ఫెక్షన్కు కారణమయ్యే హానికరమైన శిలీంధ్రాలతో పోరాడుతాయని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల చర్మ నష్టం ఎక్కువగా జరుగుతుందని, దురద, చర్మం ఎర్రబారటం, వాపు రావడం, గజ్జి, అథ్లెట్ ఫుట్ జాక్, అలర్జీలు వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అందుకే ఈ చర్మ సమస్యల(Skin Problems) నివారణకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రతి రోజూ శుభ్రమైన బట్టలతో పాటుగా పొడి బట్టలను ధరించాలని, బిగుతుగా ఉండే బట్టలు, బూట్లు ధరించడం మానుకోవాలని, రోజుకు కనీసం ఒక్కసారైన స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గోళ్లు పొడుగ్గా ఉండకుండా కట్ చేసుకోవాలని, చెప్పులు లేకుండా బయట ఎక్కువగా తిరగకూడదని వైద్యులు తెలుపుతున్నారు.