అన్నమయ్య: అనారోగ్యం తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తంబళ్లపల్లె మండలం కోటకొండ వడ్డిపల్లికి చెందిన హరిబాబు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రులలో చూపించి మందులు వాడితే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు నయం కాలేదు. దీంతో ఆదివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.