AP: సీఎం చంద్రబాబు ఏలూరు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పోలవరం గ్రామం నుంచి ప్రాజెక్టు వరకు ఐదు అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత పేరుతో అడుగడుగున అందరినీ అడ్డుకుంటున్నారు. పోలవరం చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యేలు మద్ధిపాటి, పెన్మెత్సను అడ్డుకున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేసిన ఎమ్మెల్యేలు వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.