రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని.. ఇది పాన్ ఇండియా సమస్య అని అభివర్ణించింది. ఈ మేరకు ఏఏ నగరాల్లో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉందో ఓ నివేదిక ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నగరాల్లో కూడా ఢిల్లీలో ఉన్నట్లే కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థలు ఉండాలని సూచించింది.