W.G: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు వినియోగించుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.