NRML: జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో 24 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయగా 50% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 8,080 మంది అభ్యర్థులకు గాను 4,035 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారన్నారు.