ATP: అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మిరప పంటకు కొత్తగా ఆశిస్తున్న నల్ల తామర పురుగు, యాజమాన్య పద్ధతుల పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న పంటలలో మిరప పంట ముఖ్యమైనదన్నారు.