రాజస్థాన్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి.. పొగ వ్యాపించడంతో 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ సెంటర్లో 350 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.