ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ మరో ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పింది. రిలీజైన 11వ రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. సెలవు కావడంతో ఆదివారం ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. కాగా ఓవరాల్గా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో సినిమా ఇది.