»Amit Shah Met Two Legendary Film Heroes Chiranjeevi Ram Charan At Delhi
Amit Shah: ఇద్దరు లెజెండ్ సినిమా హీరోలను కలిశా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)తో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), ఆర్ఆర్ఆర్ ఫేమ్ హీరో రామ్చరణ్(ram charan) న్యూఢిల్లీ(delhi)లో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. అయితే RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి చెర్రీని అభినందించారు. ఆ క్రమంలో హీరో రామ్ చరణ్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందించగా..చిరంజీవి మంత్రికి కండువా కప్పారు. ఆ తర్వాత అమిత్ షా.. రామ్ చరణ్(ram charan)కు శాలువా కప్పి సత్కరించారు. ఆ క్రమంలో వారు సోఫాలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. అయితే వారి భేటీకి సంబంధించిన కొన్ని చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ నేపథ్యంలో ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి అమిత్ షాకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.
మరోవైపు అమిత్ షా(amit shah) సైతం తన ట్విట్టర్ వేదికగా ఇద్దరు లెజెండ్ సినిమా హీరోలను కలవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశ సంస్కృతి & ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాటు-నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న రామ్ చరణ్, ‘RRR’ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఇక వీరి భేటీ ప్రస్తుతం కొంత మంది రాజకీయ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ రాజకీయాల్లో లేరు. కానీ చరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని అంటున్నారు.
95వ అకాడమీ అవార్డ్స్ 2023 వేడుకల్లో భాగంగా RRR చిత్రంలోని నాటు నాటు పాట ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ అవార్డును గెలుచుకుంది. ఇక ఈ చిత్రానికి SS రాజమౌళి దర్శకత్వం వహించగా..రామ్ చరణ్, Jr NTR హీరోలుగా నటించారు. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే ఎక్కువగా ప్రజాధారణ పొందింది.