GNTR: అల్లు అర్జున్ అరెస్ట్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అంటూ ఆయన ‘x’లో ట్వీట్ చేశారు. పుష్ప-2 సినిమా రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. మొదటిరోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసినవాడు “మనవాడు” కావడం ఎంతో గర్వకారణమంటూ ఆయన అప్పట్లో పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.