కృష్ణా: బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవి ఫేక్ వీడియోలైతే నిజమైన వీడియోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. మీపై వస్తున్న విమర్శలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. చేసిన తప్పులు బయటపడితే ఎదురుదాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.