»Ex Bihar Cms Interesting Comments Ravana Is Greater Than Ram
Jitan Ram Manjhi : బిహార్ మాజీ సీఎం ఆసక్తికర కామంట్స్…రాముడి కంటే రావణుడే గొప్పవాడు..
హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) మరోసారి ఆసక్తికర కామంట్స్ చేశారు. రాముడి (Ramudu) కంటే రావణుడు చాలా పనిమంతుడు. కానీ ఇదంతా కల్పితం కాబట్టి. ఏదీ నమ్మాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్(Ramacharitamanas) రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత, బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) మరోసారి ఆసక్తికర కామంట్స్ చేశారు. రాముడి (Ramudu) కంటే రావణుడు చాలా పనిమంతుడు. కానీ ఇదంతా కల్పితం కాబట్టి. ఏదీ నమ్మాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. తులసీదాస్ గురించి వాల్మీకి గురించి ప్రస్తావించారు. వారి రామాయణ, రామచరితమానస్(Ramacharitamanas) రచనల్లో అనేక తప్పిదాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. బిహార్ విద్యాశాఖ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత చంద్రశేఖర్.. రామాచరితమానస్ మీద చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం కొంత కాలంగా వాడీవేడగా ఉంది. ఇది కాస్త చల్లబడుతోంది అనుకునే లోపే..మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదోడు, ధనికుడు గురించి మాట్లాడకుండా రాముడు, రావణ గురించి మాట్లాడితే లాభమేంటని జితన్ రాం అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నిజానికి రామాయణాన్ని మేము ఒక కల్పిత కథగా భావిస్తాము. ఊహాజనితం నుంచి వచ్చిన కథ అది. ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే అందులోని పాత్రలు రాముడు, రావణుడి (Ravanudi) పాత్రలను కూడా మేము కల్పితాలుగా భావిస్తాము. ఇంతా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో రాముడి పట్ల అచంచలమైన విశ్వాసం ఉందని, అందుకే రాముడి గురించి ఇలా మాట్లాడకూడదని చివర్లో అనడం గమనార్హం. ఇక ఇదే సమయంలో బీజేపీ నేతలకు జేడీయూ నేత జమా ఖాన్ (JDU leader Jama Khan) ప్రశ్నలు సంధించారు. బీజేపీ (Bjp)నేతలు హనుమాన్ చాలిసా(Hanuman Chalisa) చదవగలరా? అసలు వారెప్పుడైనా చదివారా అని ప్రశ్నించారు. కాగా, మాంఝీ చేసిన వ్యాఖ్యలు బిహార్ (Bihar) రాష్ట్ర రాజకీయాన్ని ఎంత వరకు కుదిపివేస్తుందో చూడాలి.