గూగుల్లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో టాప్ 10లో నటి హీనా ఖాన్ ఉన్నారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇది సంతోష పడాల్సిన విషయం కాదన్నారు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. హీనా క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఈ ఏడాది ఆరంభంలో వెల్లడించారు. దీంతో హీనా గురించి చాలా మంది గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశారు.