బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మర్దానీ 3’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అభిరాజ్ మినావాలా తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.