TG: మోహన్‌బాబు గురువారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి నివాసంలో మోహన్‌బాబు, మనోజ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్పల్లి నివాసం దగ్గర ప్రైవేటు వ్యక్తులను అనుమతించడంలేదు. అయితే విష్ణు మాత్రం ఇంకా అక్కడికి రానట్లు తెలుస్తోంది. విష్ణు ప్రస్తుతం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.