తన పిల్లలను కలవకుండా తల్లిని అడ్డుకోవటం క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఇలా అడ్డుకోవటం వల్ల తల్లి మానసిక ఆరోగ్యపై తీవ్ర ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. అత్తమామల ప్రవర్తన ఐపీసీ సెక్షన్ 498-ఏ కిందకు వస్తుందని.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపింది. ఈ మేరకు ఓ మహిళ అత్తమామలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమని పేర్కొంది.