KDP: పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు.