ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌తో బన్నీ భేటీ అయ్యారన్న వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అల్లుఅర్జున్ టీమ్ స్పందించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పేర్కొంది.