‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యూమెంటరీ వివాదం విషయంలో నటి నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన అనుమతి తీసుకోకుండా ఈ సిరీస్‌లో ‘నానుమ్ రౌడీ ధాన్’ సన్నివేశాలను ఉపయోగించారంటూ ధనుష్ ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ అంశంపై జనవరి 8 లోపు వివరణ ఇవ్వాలని నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, నెట్‌ఫ్లిక్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.