సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై సెమీస్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో విదర్భపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై.. ఈ లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ముంబై ఓపెనర్లు పృథ్వీ షా (49), అజింక్య రహానె (84) దంచికొట్టారు.