E.G: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓ ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. జీవితఖైదు అనుభవిస్తున్న నిందుడితో ఉన్నతాధికారి వ్యక్తిగత పనులు చేయించుకోవడమే కాకుండా దాడి చేయడంతో అతను గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.