»Nikhat Zareens First Punch In Womens Boxing World Championships
Nikhat Zareen : మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నిఖత్ జరీన్ తొలి పంచ్
తెలంగాణ (Telangana) మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో(World Championships) శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు (Azerbaijan) చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు.
తెలంగాణ (Telangana) మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో(World Championships) శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు (Azerbaijan) చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు. తొలి బౌట్‌లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ ఇస్మయిలోవా మొహంపై పంచ్‌లతో అటాక్ చేసింది. అయితే రిఫరీ అడ్డుకొని ఆర్ఎస్సీ(Referee Stops Contest) కింద నిఖత్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇక నిఖత్ జరీన్ రౌండ్ ఆఫ్ 32లో ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్ను (Raumaisa Boulam) ఎదుర్కోనుంది. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్ మారియాను 5-0తో చిత్తు చేసింది.
గతేడాది ఇస్తాంబుల్ (Istanbul) వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం నెగ్గిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ క్రీడా ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. ప్రపంచ చాంపియన్ అయిన తొలి తెలుగు బాక్సర్ గా నిలిచిన ఆమె ఇప్పుడు తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది. స్వదేశంలో తాజా ఎడిషన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫేవరెట్ గా బరిలో దిగింది.తొలి రౌండ్ లోనే తన పంచ్ పవర్ చూపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీ) తొలి రౌండ్లో అజర్ బైజాన్‌కు చెందిన అనఖనిమ్ ఇస్మాయిలోవాను(Anakhanim Ismailovan) చిత్తు చేసి తన టైటిల్ వేటను ఆరంభించింది. ఈ బౌట్ లో నిఖత్ జరీన్ (Nikhat Zareen)పంచ్ ల ధాటికి ప్రత్యర్థి తట్టుకోలేకపోయింది. దాంతో, రెండో రౌండ్ మధ్యలోనే బౌట్ ను నిలిపివేసిన రిఫరీ నిఖత్ ను విజేతగా ప్రకటించాడు. సూపర్ పంచ్ తో హైదరాబాదీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టింది.