»Indian Army Cheetah Helicopter Crashes In Arunachal Pradesh
Cheetah helicopter:కూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా.. పైలట్లు మిస్సింగ్
Cheetah helicopter:భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah helicopter) ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో (arunachal pradesh) కుప్పకూలింది. బొమ్డిల పట్టణానికి పశ్చిమాన గల మండలా (mandala) అనే చోట కూలిందని.. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (air traffic control) సంబంధాలు కోల్పోయింది.
Indian Army Cheetah helicopter crashes in Arunachal Pradesh
Cheetah helicopter:భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah helicopter) ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో (arunachal pradesh) కుప్పకూలింది. బొమ్డిల పట్టణానికి పశ్చిమాన గల మండలా (mandala) అనే చోట కూలిందని.. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (air traffic control) సంబంధాలు కోల్పోయింది. హెలికాప్టర్ (helicopter) సెంగె నుంచి మిస్సమరి వెళుతుందని.. గౌహతి రక్షణరంగ పీఆర్వో లెప్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు.
చీతా హెలికాప్టర్లో (Cheetah helicopter) పైలట్లుగా లెప్టినెంట్ కల్నల్, మేజర్ ఉన్నారని తెలిసింది. వారి ఆచూకీ కోసం గాలింపు బృందాలు రంగంలోకి దిగాయి. భారత వైమానిక దళంలో చేతక్ (chetak), చీతా హెలికాప్టర్లు (Cheetah helicopter) 200 వరకు ఉన్నాయి. ఎత్తయిన ప్రదేశాల్లో సాయుధ బలగాలకు ఇవి రక్షణగా ఉంటాయి. హెలికాప్టర్లు పాతబడటంతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి స్థానాల్లో కొత్త వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది.