2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర కేబినెట్ రేపు జమిలి బిల్లుకు ఆమోదం తెలపనుంది. అనంతరం జమిలి బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జేపీసీ ద్వారానే జమిలిపై ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు.