PLD: మరణించిన కానిస్టేబుల్ కుటుంబాలకు పోలీస్ శాఖ తరపున మంగళవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జెవి సంతోష్ ఆర్థిక సహాయం అందించారు. విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్యాం ప్రసాద్, కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయాన్ని భవిష్యత్తులోనూ చేస్తామని అదనపు ఎస్పీ తెలిపారు.