GNTR: అమరావతి రాజధాని పునఃప్రారంభ సభ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. సుమారు 6,500మందిపైగా వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తు చేశామన్నారు. 250సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అస్త్రం’ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ట్రాఫిక్, ప్రజల రద్దీని పర్యవేక్షిస్తున్నామన్నారు.