E.G: సఖినేటిపల్లిలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా కొంతమందిని హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పోలిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తుల అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేసి గోవులను వారికి అప్పగించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై దుర్గా శ్రీనివాస్ తెలిపారు. ఆవులను అంతర్వేది గోశాలకు తరలించారు.