పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే ABC జ్యూస్‌తో శరీరానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్, బీట్ రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఐరన్, మెగ్నీషియం వంటివి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శరీరంలోని వ్యర్థాలని తొలగిస్తాయి. కళ్లు, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.