ప్రకాశం: పొదిలి మండలం అడ్డరోడ్డు సమీపంలో ఒక గృహంలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వచేసిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన విషయంపై అధికారులు విచారిస్తున్నారు.