భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆచితూచీ బ్యాటింగ్ చేస్తోంది. 24 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. లబుషేన్ 13, మెక్స్వినీ 27 పరుగులు చేశారు. ఇక భారత్ స్టార్ పేసర్ బుమ్రాకు వికెట్ దక్కింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.