బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి 42, కేఎల్ రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టాడు. బోలాండ్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.