పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోపీపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించిన ఐసీసీ.. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని సమాచారం. కాగా.. ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య గురువారం జరిగిన అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.