ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా AUS,IND మధ్య ఇవాళ్టి నుంచే రెండో టెస్టు ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్లో బోణీ కొట్టిన టీమిండియా.. అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం ఉంది.