PLD: చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న జాన్ ఫ్రెడ్డి పాల్ మార్టిన్ జాతీయ క్రీడలకు ఎంపికయ్యాడు. ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 నెట్ బాల్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరపున పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.